మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Shanmukha Stotram – శ్రీ షణ్ముఖ స్తోత్రం
నారదాదిదేవయోగిబృందహృన్నికేతనం
బర్హివర్యవాహమిందుశేఖరేష్టనందనమ్ |
భక్తలోకరోగదుఃఖపాపసంఘభంజనం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || 1 ||
తారకారీమింద్రముఖ్యదేవబృందవందితం
చంద్రచందనాది శీతలాంకమాత్మభావితమ్ |
యక్షసిద్ధకిన్నరాదిముఖ్యదివ్యపూజితం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || 2 ||
చంపకాబ్జమాలతీసుమాదిమాల్యభూషితం
దివ్యషట్కిరీటహారకుండలాద్యలంకృతమ్ |
కుంకుమాదియుక్తదివ్యగంధపంకలేపితం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || 3 ||
ఆశ్రితాఖిలేష్టలోకరక్షణామరాంఘ్రిపం
శక్తిపాణిమచ్యుతేంద్రపద్మసంభవాధిపమ్ |
శిష్టలోకచింతితార్థసిద్ధిదానలోలుపం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || 4 ||
వీరబాహు పూర్వకోటివీరసంఘసౌఖ్యదం
శూరపద్మముఖ్యలక్షకోటిశూరముక్తిదమ్ |
ఇంద్రపూర్వదేవసంఘసిద్ధనిత్యసౌఖ్యదం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || 5 ||
జంబవైరికామినీమనోరథాభిపూరకం
కుంభసంభవాయ సర్వధర్మసారదాయకమ్ |
తం భవాబ్ధిపోతమంబికేయమాశు సిద్ధిదం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || 6 ||
పూర్ణచంద్రబింబకోటితుల్యవక్త్రపంకజం
వర్ణనీయసచ్చరిత్రమిష్టసిద్ధిదాయకమ్ |
స్వర్ణవర్ణగాత్రముగ్రసిద్ధలోకశిక్షకం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || 7 ||
పూర్వజన్మసంచితాఘసంఘభంగతత్పరం
సర్వధర్మదానకర్మపూర్వపుణ్యసిద్ధిదమ్ |
సర్వశత్రుసంఘభంగదక్షమింద్రజాపతిం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || 8 ||
ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ తిరుచేందూర్ శ్రీ షణ్ముఖ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.